డీజే ఫార్మ్ 1969లో డేవిడ్ లోబో ద్వారా ప్రారంభించబడినది. ఆసియాలో విస్తృతమైన కోకొనట్ బ్రీడింగ్ ప్రోగ్రాంలను నిర్వహించిన యుఎన్ ఎక్స్పర్ట్, ప్రొఫెసర్. ఆంథోనీ డేవిస్, కోకనట్ బ్రీడింగ్ ప్రారంభించమని డేవిడ్ లోబోని ప్రోత్సహించారు. 1983లో, డీజే కోకోనట్ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్, దక్షిణ భారతదేశంలో మదురైలో 200 ఎకరాల ప్లాటులో ప్రారంభించబడినది. దీని ఫలితం – డీజే సంపూర్ణ హైబ్రిడ్.
నేటికి కోకనట్ హైబ్రిడైజేషన్ లో 34 సంవత్సరాల అనుభవం మరియు పరిశోధనతో, డీజే ప్రపంచంలోనే త్వరితగతిన మరియు అధిక దిగుబడినిచ్చే కొబ్బరి మొక్కలను ఉత్పత్తి చేస్తోంది.
డీజే సంపూర్ణ మూడవ సంవత్సరములో పూతకు వస్తుంది మరియు చాలా తక్కువ పెట్టుబడితో సాధారణ దేశవాళి రకాల కన్నా నాలుగు నుండి ఆరు రెట్లు ఎక్కువ దిగుబడిని ఇస్తుంది.
గత 25 సంవత్సరాలుగా డీజే 25 లక్షలకు [2.5 మిలినయన్లు] పైగా హైబ్రిడ్ మొక్కలని ఉత్పత్తి చేసింది మరియు 20,000 పైగా రైతులను సంతోషపరిచింది. చిన్న రైతులు యొక్క జీవితాలు కూడా చాలా బాగా మెరుగుపడే విధముగా ప్రోత్సహించింది.
“ఉత్తమమైనది అందుబాటులో ఉన్నప్పుడు మంచిది అంతమంచిది కాదు”. డీజే సంపూర్ణతో మీ లాభాలను మెరుగుపరుచుకోండి. మీరు కొబ్బరి మొక్కలని జీవిత కాలంలో ఒకసారి మాత్రమే నాటుతారు. కావున తెలివిగా ఎంపిక చేసుకోండి.
చరిత్ర
డీజే కోకోనట్ ఫార్మ్, ఇండియాలో బెంగుళూరు ప్రధాన కేంద్రంగా ఉంది మరియు 50 సంవత్సరాల వ్యవసాయ-పశుగణ అనుభవాన్ని కలిగి ఉంది. కంపెనీ మూడు జాయింట్ వెంచర్లను కలిగి ఉంది మరియు మరిన్ని రాబోతున్నాయి.
డీజే కోకోనట్ బ్రీడింగ్ కంపెనీ మదురై (తమిళ నాడు) సమీపంలో 200 ఎకరాలలో ప్రారంభించబడినది మరియు అప్పటి నుండి అది అంబూర్ (తమిళ నాడు), బైలూరు (కర్ణాటక), సాలౌలియం, సాగ్యూం, పిర్ల మరియు బాలి (గోవా)లో మరియు ఇటీవల పెనుకొండలో (ఆంధ్ర ప్రదేశ్) విస్తరించింది. బ్రీండింగ్ ఫార్మ్స్ సుమారుగా 550 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 30,000 డీజే డ్వార్ఫ్ మదర్ పామ్స్ ఉన్నాయి. మొదటి వాణిజ్య హైబ్రిడ్ ఫార్మ్ 120 ఎకరాలలో మోడల్ ఆర్గానిక్ ఫార్మ్‌గా రూపొందించడానికి ప్రారంభించబడినది.
శ్రీ. డేవిడ్ జె లోబో – ఛైర్మన్ డీజే గ్రూపు
డేవిడ్ జె లోబో డీజే గ్రూపు యొక్క ఫౌండర్ మరియు ఛైర్మన్. ఆయన బ్రిడ్జ్ ఫౌండేషన్, భారతదేశంలో పెద్ద సంస్థలలో ఒకటైన మైక్రో ఎంటర్ ప్రైజ్ డెవలప్మెంట్ ట్రస్టుని 1983లో నెలకొల్పారు. ఆయన జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (XIME) సహ స్థాపకులు ఇది భారతదేశంలో ఉత్తమమైన ఇరవై మేనేజిమెంట్ కళాశాలలో ఎంపిక చేయబడినది. అతను మెక్‌డోనాల్డ్స్ ఫుడ్ చెయిన్ ని భారతే దేశంలో తీసుకురావడానికి కీలకంగా ఉండి, వారి ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని దాదాపు ఒక దశాబ్దం పాటు నడిపినారు. డేవిడ్ లోబో వ్యవసాయ- పుశుగణ విభాగంలో గ్రామీణ అభివృద్ధి మరియు ఉత్పాదకత కొరకు జాతీయ ఉత్పాదకతా అవార్డును శిరోమణి అవార్డును భారత ఉపరాష్ట్రపతి శ్రీ శంకర్ దయాళ్ శర్మ ద్వారా స్వీకరించారు.
మా మిషన్
అత్యధిక ఉత్పాదకత కలిగిన కొబ్బరి మొక్కలను ఉత్పత్తి చేసి దాని ఫలితముగా వెలువడే కొబ్బరి కాయలు మరియు కొబ్బరి ఆధారిత ఉత్పత్తులను అతి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి గావించడము మూలముగా చిన్న రైతుల జీవన శైలిని ఉత్తమమైన జీనవ విధానంగా మార్చడము.
మా విజన్
- కోటి మంది చిన్న రైతులను బీదరికము నుండి నాణ్యమైన జీవన శైలికి మార్చడము.
- కోకోనట్ ఫార్మింగ్ టెక్నాలజీలో మరియు కోకోనట్ ఆధారిత ఉత్పత్తులలో మెరుగైన ఆధునికత నెలకొల్పడము.
మా మూల విలువలు
- మేము అణకువ ఆత్మీయతతో, యధార్థతతో మరియు పక్షపాతం లేని మార్గాన్ని అనుసరిస్తూ దేవునిపై సంపూర్ణ అంకికతత్వం పైన విశ్వసిస్తాము
- చేయూతనిచ్చే నాయకత్వం: ‘ప్రజలే మా గొప్ప బలం అని మేము విశ్వసిస్తాము’ వారి పురోగతి మరియు వ్యక్తిగత అభివృద్ధి, బహిరంగ కమ్యూనికేషన్ మరియు ఆరోగ్యకరమైన పరస్పర సంభాషణ, భవిష్యత్తును కోరుకునే వారికి పరిపూర్ణం చేసుకోవడానికి ఒక వాతావరణాన్ని అందిస్తాము.
- వినియోగదారుల సంతృప్తి: మా వినియోగదారులు ఆశించిన లాభాలు పొందే వరకు అమ్మకం పూర్తి కాదని మేము విశ్వసిస్తాము.
- మా రివార్డులు: సమాజానికి అందించిన సేవల లోనే మాకు లాభం ఉందని మరియు చట్టబద్ధమైన బహుమానము అని మేము విశ్వసిస్తాము.