1981లో, కర్ణాటకలో కంప్యూటర్లను ఉపయోగించిన మొదటి వాణిజ్య సంస్థగా డీజే ఉండినది. 1983లో కోకోనట్ బ్రీడింగ్ ప్రాజెక్ట్ ప్రారంభించబడినప్పటి నుండి, ప్లాంటింగ్ మరియు నెలవారీ అభివృద్ధి సమాచారం ఒక్కో పామ్ యొక్క నెలవారీ ఉత్పాదకత డేటా రికార్డింగ్ ఎంట్రీ కంప్యూటరీకరించడమైనది. మా డేటా బ్యాంకులో 30,000 + పామ్స్ గురించి మొత్తం సమాచారం కలిగి ఉంది.
ప్రస్తుతము కంప్యూటరీకరించిన 30,000 పామ్స్ నుండి ఉత్తమమైన 1% పామ్స్ ని, ఉత్పాదకత మరియు పామ్ యొక్క 21 లక్షణాలను అది ఉత్పత్తి చేసే కొబ్బరి యొక్క 17 లక్షణాల ఆధారంగా ఎన్నుకుంటాము. ఈ కఠినమైన మరియు తప్పనిసరి ప్రక్రియ ఉత్తమమైన తరువాతి తరం పిడిగ్రీ మదర్ ఎమాస్కులేషన్ స్టాకుని పెంచడానికి మాకు వీలుకల్పిస్తుంది. ఎమాస్కులేషన్, బ్రష్ల ద్వారా ఆడ బటన్స్ ని చేతి ద్వారా ఫలదీకరణం చేయడం, తరువాత బ్యాగింగ్ మరియు లేబిలింగ్ ద్వారా ఉత్పత్తి చేసిన ప్రతి మదర్ పామ్ యొక్క పిడిగ్రీ ఖచ్చితత్వాన్ని నిశ్చయపరుస్తుంది. డీజే డ్వార్ఫ్ మదర్ పామ్ ప్రస్తుతం పేటెంటింగ్లో ఉన్నది.
ఈ డ్వార్ఫ్ 18 నెలలో పూలు పూయడం ప్రారంభించి త్వరలో పెద్ద సంఖ్యలో పెద్ద సైజు కొబ్బరి గుత్తులుగా తయారవుతుంది. ఈ లాభాలు డీజే హైబ్రిడ్ లో హైబ్రిడైజేషన్ ప్రక్రియ ద్వారా సంక్రిమిస్తాయి. ఒక్కో డ్వార్ఫ్ పామ్ మట్టల సంఖ్య, ప్రతి మట్టకు ఉండే ఆకుల సంఖ్య, ఆ ఆకుల యొక్క వెడల్పు కొలవబడి రికార్డు చేయబడతాయి. పైన తెలిపిన లక్షణాలు అన్నీఎన్నిక ప్రక్రియలో ఉపయోగించబడతాయి. ఇంకా ప్రతి బ్రీడింగ్ ఫార్మ్ ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయబడుతుంది. ప్రతి నెల, డ్వార్ఫ్ మదర్లలో అతి బలహీనమైన వాటిని, గత 6 సంవత్సరాల సగటు పనితీరుని బట్టి, తొలగించబడతాయి మరియు వాటి ప్రదేశంలో ఉత్తమమైన మరియు తాజా పిడిగ్రీ మదర్స్ నాటబడతాయి. ఇది నిరంతరం మెరుగుదలను పెంచడానికి తోడ్పడుతుంది.