హైబ్రిడైజేషన్ పద్ధతి
ఒక కోకోనట్ బ్రీడింగ్ ప్రాజెక్టులో ఇమిడి ఉండేవి
-
డ్వార్ఫ్ మదర్ ప్లాంట్‌లో పువ్వు గుత్తికి పక్వానికి వచ్చే సరైన స్థాయిని గుర్తించడం.
-
పువ్వు గుత్తిలో ప్రతి మగ పువ్వుని (10,000 పైగా) , ఆడ బటన్లని ఏమాత్రం గాయపరచకుండా లేదా తాకకుండా చేతితో కత్తిరించడం.
-
ప్రతి ఆకు కొమ్మ పైన ఎమాస్కులేషన్ తేదీని చెక్కి వుంచడం మరియు రాబోవు నెలలలో పెరుగుదలకు సులువుగా అన్వయించడం.
-
కీటకాలను నిరోధించే ప్రొటెక్టివ్ కోట్ స్ప్రే చేయడం.
-
ఎన్నుకోబడిన దేశవాళి పామ్స్ నుండి పుప్పొడిని ప్రత్యేకంగా తయారు చేయడం, ప్రాసెస్ చేసి మరియు మదురై లోని మా లేబరేటరీ నుండి పంపబడిన వాటిని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులలో అనువుగా ఉండటానికి భద్రపరచడం.
-
కొన్ని రోజుల తరువాత పక్వానికి వచ్చినప్పుడు ఆడ బటన్లను నిపుణులచే బ్రష్ తో ఫలదీకరణం చేయడం, ఒక బటన్ని 7 నుండి 10 రోజులకు పైగా, ఒక వ్యక్తి ప్రతిచెట్టు ఎక్కి పరీక్షించాల్సిన అవసరం ఉంటుంది.
-
ప్రతి పామ్ యొక్క కంప్యూటరీకరించిన రికార్డులలో బటన్ల సంఖ్యను పొందుపరచడం – అంటే “బటన్ కౌంట్”
-
రికార్డు కొరకు మరియు భవిష్యత్తులో హైబ్రిడ్ కొబ్బరి విత్తనాలు మరియు మొక్కల ఉత్పత్తిని అంచనా వేయడానికి 120 రోజుల తరువాత బటన్ కౌంట్ తనిఖీ చేయబడుతుంది.
-
ఈ విధానము ప్రతి ఆకు నుండి వచ్చే ప్రతి పువ్వు కొరకు ప్రతి మదర్ పామ్‌ను దాదాపు 18 సార్లు లేదా ఇంకా ఎక్కువగా ప్రతి నెల చేయబడుతుంది.
-
సీజను అనుగుణంగా 11 నెలలు నుంచి 13 నెలల వయస్సులో పక్వానికి వచ్చే స్థాయిని బట్టి కాయలు కోయబడతాయి ప్రతి ఒక్క చెట్టు యొక్క రికార్డు ప్రత్యేకంగా నెలవారీగా నిర్వహించబడతాయి.
నర్సరీ
-
అతి జాగ్రత్తగా కోసిన కాయలు, భద్రముగా పేర్చబడి ఆశించిన చిగురుదల కొరకు ఆశించినంత క్రియరహితంగా ఉంచబడతాయి.
-
కాయలో నీటి శాతం సరియైన స్థాయిలో ఉన్నప్పుడు [కాయని ఊపి శబ్దం వినడం ద్వారా తనిఖీ చేసినవి] కాయలు నాణ్యత కొరకు ఎన్నుకోబడతాయి. తిరస్కరించబడిన నట్స్ అమ్మకానికి వెళతాయి. ఎన్నుకోబడిన నట్స్ నర్సరీ బెడ్ లోకి వెళతాయి.
-
నర్సరీలో లేత కొమ్మలు తినే క్రూర జంతువులు [అడవి పందుల], చెదలు మొదలగుని, మేసే జంతువులు నుండి పరిరక్షణ చేయబడుతుంది.
-
6 నెలల తరువాత, నాణ్యత మరియు స్వచ్ఛదనము కొరకు మొలకెత్తిన మొక్కలు ఎన్నిక చేయబడతాయి .
-
తిరస్కరించబడిన మొక్కలు కత్తిరించబడతాయి మరియు రికార్డు చేయబడి నాణ్యమైన హైబ్రిడుతో ఎటువంటి రూపంలోనైనా కలవకుండా నివారించబడతాయి.
-
వినియోగదారునికి చేరే ముందు, ప్రతి మొక్కకి సెల్ఫ్-డిస్ట్రక్ట్ హోలోగ్రామ్ స్టిక్కర్ (కల్తీ జరకుండా అడ్డుకోవడానికి) అంటించబడుతుంది.
-
వారి ఆర్డర్లను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు కస్టమర్లకు మొక్కలు డిస్పాచ్ చేయబడుతాయి. ప్రతి వినియోగదారునికి హోలోగ్రామ్ స్టికర్ లేకుండా ఏ ఒక్క మెక్కని అంగీకరించవద్దని తెలియజేయబడుతుంది (కల్తీ మరియు మోసపోయో మార్గాలు నివారించడానికి).
డీజే బ్రీడింగ్ ప్రోగ్రాం
తరువాతి తరం మదర్ స్టాక్ ఉత్పత్తి కోసం
-
గత ఆరు సంవత్సరాల నుండి సగటు ఉత్పత్తి ఆధారంగా, రికార్డులు కంప్యూటరీకరించబడినాయి, ఇందులో సుమారుగా 30,000 మదర్ పామ్స్ నుండి 2% ఉత్తమ మదర్ డ్వార్ఫ్స్ కంప్యూటరీకరణ ద్వారా ఎన్నుకోబడుతుంది.
-
ఈ 600 అత్యధిక ఉత్పత్తి పామ్స్ విడిగా, క్రింద తెలిపిన లక్షణాలతో వేరు చేయబడతాయి: – చెట్టు లక్షణాలు – పుష్పించే సమయానికి వయస్సు [ప్రారంభ ఉత్పత్తిని కొలవడానికి], కొబ్బరి మట్టకి ఆకుల సంఖ్య , మట్ట బలం, పామ్ ఎత్తు [ పొడవైన వాటి కన్నా పొడవు తక్కువ ఉన్న వాటికి ప్రాధాన్యత], ఆకుల బలం, చిన్న ఆకుల సంఖ్య, పొడవు, వెడల్పు మరియు చిన్న ఆకుల సంఖ్య. కాయ లక్షణాలు – కాయ యొక్క బరువు పీచుతో మరియు పీచు తీసి, పెంకు మందం, గుజ్జు మందం, కొబ్బరి బరువు, నూనె శాతం మొదలగునవి.
-
ఈ 600 చెట్లలో చాలా తక్కువ చెట్లు మాత్రమే ఎన్నుకోబడి, నంబర్ వేసి ట్యాగ్ చేయబడతాయి. ఇవి తరువాతి తరం మదర్స్ కి “గ్రాండ్ మదర్స్” అవుతాయి.
-
ఈ జాబితా నుండి, చాలా ఉత్తమ పామ్స్ డ్వార్ఫ్ మదర్ లైన్ యొక్క ఫాదర్స్ గా ఉపయోగించడానికి ఎన్నుకోబడతాయి- ప్రాధాన్యతగల లక్షణాల కొరకు చేసే ఈ పద్ధతిని ఇన్ బ్రీడింగ్ అని అంటారు.
-
ఫాదర్ పామ్స్ యొక్క పుప్పొడి జాగ్రత్తగా ప్రాసెస్ చేసి కలిసిపోకుండా నివారిస్తూ లేబుల్ చేయబడతాయి.
-
ఒక మగ పామ్ నాయకత్వంతో [ చాలా ప్రత్యేకంగా ఉత్తమ ‘ఫాదర్స్’] నుండి పిడిగ్రీ ఫలదీకరణం కొరకు, ఆడ పామ్స్ సమూహముతో చాలా కుటుంబాలు సృష్టించబడతాయి. ప్రతి కాయ రికార్డు చేయబడి ఫెయిల్ ప్రూఫ్ ట్యాగ్ చేయబడుతుంది. ఆ ట్యాగ్ పిడిగ్రీ యొక్క వివరాలు కలిగి వుండి అవి కంప్యూటరీకరణ ప్రక్రియలో భద్రపరచబడతాయి.
-
పక్వానికి వచ్చిన తరువాత, కాయలు కోయబడతాయి , అవి మదర్ వారీగా మరియు కుటుంబ పరంగా నాటబడతాయి.
-
అన్ని స్థాయిలలో రికార్డులు నిర్వహించబడతాయి మరియు పిడిగ్రీ మొక్కలు మళ్ళీ ట్యాగ్ చేయబడతాయి, వాటిని ఎక్కడ ఎప్పుడు నాటారో రికార్డ్ చేయబడతాయి.
-
ఈ విధముగా తయారు చేసిన పిడిగ్రీ మొక్కలను కోకోనట్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ లేదా సిఐపిలో ఉపయోగిస్తారు.
డీజే నిరంతర మెరుగుదల కార్యక్రమం
-
బ్రీడింగ్ ఫామ్స్ యొక్క జెనెటిక్స్ ని నిరంతరంగా మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది, దీని వలన డీజే హైబ్రిడ్స్ యొక్క నిరంతర ఉత్పాదక మెరుగుదల పెంచడానికి ఉపకరిస్తుంది.
-
ప్రతి నెల, ప్రతి బ్రీడింగ్ ఫార్మ్ అర్ధ శాతం చాలా బలహీనమైన మదర్స్‌ని ఒక కంప్యూటరీకరించిన స్టేట్మెంటు ద్వారా తెలియపరచబడుతుంది.
-
ఈ 0.5% పామ్స్ తొలగించబడతాయి.
-
ఆ స్థలంలో నాటబడిన డీజే డ్వార్ఫ్ మదర్ పామ్ పిడిగ్రీడ్ ట్యాగ్ చేయబడి లేబుల్ చేయబడతాయి, దాని రికార్డులు, మామూలుగా, నిర్వహించబడతాయి. ఈ కొత్త మొక్క ఆశించినట్లు ఒక సూపర్ మదర్ లేదా దాని పిడిగ్రీకి సమీపంగా తయారవుతుంది.
-
ఈ ప్రక్రియ ప్రతి నెల చేయబడుతుంది అంటే ప్రతి సంవత్సరం అత్యంత బలహీనమైన పామ్స్ లో 6% ఉన్నతమైన పిడిగ్రీ స్టాకుతో మార్చబడతాయి.
-
ఈ పద్ధతిలో, ప్రతి 20 సంవత్సరాలకు మొత్తం తోట ఉత్తమమైన మదర్స్ తో మార్చబడుతుందని దీని అర్థం.
-
సంవత్సరం పొడవునా డీజే హైబ్రిడ్స్ యొక్క ఉత్పాదకతలో ముగింపు లేని మెరుగుదల అని అర్థం.
-
చిన్న మరియు పెరిగే మొక్కల వలన మొలకల ఉత్పత్తి సుమారుగా 20% తగ్గించడం అని దీని అర్థం.
-
ఇది సంస్థకి చాలా పెద్ద ఖర్చుగా అవుతుంది కానీ రైతు యొక్క ప్రయోజనమును దృష్టిలో ఉంచుకుంటే ఇది విలువైనదిగా పరిగణించబడదు. బ్రీడింగ్ ఫామ్ ఖర్చు కన్నా రైతుకు లాభం వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది.
-
డీజే ఎల్లప్పుడూ తనకుతాను నిరంతర అభివృద్ధి యొక్క సూత్రాలకు అనుగుణంగా మరియు ప్రతి పనిని ఉత్తమమైన మార్గంలో చేయడానికి ఉద్దేశ్యించి ఉన్నది.
-
మాకు తెలిసినంత వరకు ఈ కార్యక్రమం ప్రపంచంలో ఇంకెక్కడా అమలు చేయబడలేదు.